అక్కినేని హీరోతో బాబి సినిమా !
Published on Feb 20, 2018 6:24 pm IST

‘అల్లుడు శ్రీను, బలుపు’ సినిమాలతో రైటర్ గా మంచి పేరు తెచ్చుకున్న బాబి డైరెక్టర్ గా మారి చేసిన ‘పవర్, జై లవకుశ’ సినిమాలు మంచి విజయం సాధించాయి. ప్రస్తుతం ఈ డైరెక్టర్ తన నెక్స్ట్ సినిమా పై పోకస్ పెట్టాడు. తాజా సమాచారం మేరకు ఈయన నాగ చైతన్యకు ఒక లైన్ చెప్పడం జరిగిందని, త్వరలో ఈ సినిమా పై తన నిర్ణయాన్ని చైతు బాబీతో వెల్లడిస్తాడని తెలుస్తోంది.

నాగ చైతన్య ప్రస్తుతం ‘సవ్యసాచి’ సినిమాలో నటిస్తున్నాడు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీతో పాటు మారుతి డైరెక్షన్లో ‘శైలజా రెడ్డి అల్లుడు’ అనే సినిమాలో సైతం నటిస్తున్నాడు చైతన్య. అను ఇమ్మాన్యుల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో రమ్యకృష్ణ చైతు అత్త పాత్రలో కనిపించబోతోంది.

 
Like us on Facebook