నానికి విలన్ గా బాలీవుడ్ నటుడు !

యంగ్ హీరో నాని నటిస్తున్న తాజా చిత్రం ‘కృషార్జున యుద్ధం’. ప్రస్తుతం చివరి దశ పనుల్లో ఉన్న ఈ సినిమా ఏప్రిల్ నెలలో రిలీజ్ కానుంది. మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నాని రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నానికి విలన్ గా బాలీవుడ్ మోడల్, నటుడు రవి అవన్ నటిస్తున్నాడు.

ఈయన గతంలో పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ‘ఇజం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రమే తనకు పూర్తిస్థాయి ప్రతినాయకుడిగా గుర్తింపునిపిస్తుందని అన్నారు. ఇందులో ఈయన హ్యూమన్ ట్రాఫికర్ గా కనిపించనున్నారు. ఈ పాత్రలో డ్రామా, ఎమోషన్ ఉంటాయని, తనకు మంచి పేరు తెస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే హిపాప్ తమీజాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మీర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.