ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హీరోయిన్ ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ సక్సెస్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమాకి సైన్ చేసిన సంగతి తెలిసిందే. చాలా రోజుల క్రితమే పూజా కార్యాక్రమాలతో లాంచ్ అయిన ఈ సినిమా మార్చి నుండి రెగ్యులర్ షూట్ కు వెళ్లనుంది. ఈ సినిమా కోసం తారక్ బరువు తగ్గి సరికొత్త లుక్ కూడా ట్రై చేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో తారక్ కు జోడీగా అను ఇమ్మాన్యుయేల్, పూజా హెగ్డే లాంటి పలువురు పేర్లు వినిపించిన ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ పేరు తెరపైకొచ్చింది.

ఇప్పటి వరకు ఎన్టీఆర్ తో నటించని హీరోయిన్ అయితే బాగుంటుందని భావించిన త్రివిక్రమ్ ఆలోచనల్లో శ్రద్ద కపూర్ అయితే బాగుంటుందనే ఆలోచన కూడా ఉందట. మరి చివరికి ఆమెనే సంప్రదిస్తారో లేకపోతే తెలుగు హీరోయిన్లలోనే ఎవరినైనా ఏంచుకుంటారో చూడాలి. అనిరుద్ సంగీతాన్ని అందివ్వనున్న ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించనున్నారు.