ఓటిటి రివ్యూ : “బొంబాట్” – సిల్లీగా ఉండే సైంటిఫిక్ ఫ్లిక్

Published on Dec 3, 2020 6:04 pm IST
Anaganaga O Athidhi Telugu Movie Review

విడుదల తేదీ : డిసెంబర్ 3rd, 2020
123telugu.com Rating : 2/5

నటీనటులు : సాయి సుశాంత్ రెడ్డి, సిమ్రాన్ చౌదరి, చాందిని చౌదరి

దర్శకత్వం : రాఘవేంద్ర వర్మ

రచన : విశ్వాస్ హన్నూర్కర్

నిర్మాత : జోష్ బి

 

పలు ఆసక్తికర ఓటిటి వెబ్ సిరీస్ లు అలాగే డిజిటల్ గా రిలీజ్ అవుతున్న సినిమాల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో నేడు విడుదల . దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబడ్డ “బొంబాట్” సినిమా చూడడం జరిగింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇపుడు రివ్యూలో తెలుసుకుందాం రండి.

కథ :

తన లైఫ్ లో అసలు ఏమాత్రం అదృష్టం లేని యువకుడు విక్కీ(సుశాంత్ రెడ్డి), సడెన్ గా మిస్సయ్యి తన కూతుర్ని మాయ(సిమ్రాన్ చౌదరి) దూరం చేసుకున్న సైంటిస్ట్ తో స్నేహం చేస్తాడు. అయితే ఓ ట్విస్ట్ లో ఆ మాయ మరెవరో కాదు ఒక హ్యుమనాయిడ్ రోబోట్ అని తెలుసుకుంటాడు. మరి ఇక్కడే మరో సైంటిస్ట్(మాక్రాండ్ దేశ్ పాండే) కూడా పరిచయం అవుతాడు. మరి సైంటిస్ట్ కథను ఎలా మలుపు తిప్పాడు? అసలు ఈ మాయ ఎవరు? మరో హీరోయిన్ చాందిని చౌదరికి ఎలాంటి రోల్ ఉంది? ఈ అందరూ ఈ కథకు ఎలా రిలేటెడ్ అవుతారు ఫైనల్ గా సైన్స్ ఫిక్షన్ డ్రామా ఎలా ముగిసింది అన్నదే అసలు కథ.

ప్లస్ పాయింట్స్ :

“ఈ నగరానికి ఏమైంది”లో కనిపించి ఆకట్టుకున్న సుశాంత్ ఈ చిత్రంలో హీరోగా మంచి నటనను కనబర్చాడు. ఓ మాదిరిగా ఓకే అని చెప్పొచ్చు. అలాగే లేటెస్ట్ గా “కలర్ ఫోటో” చిత్రంతో ఆకట్టుకున్న చాందిని చౌదరి ఈ చిత్రంలో చిన్న రోల్ ను కూడా బాగా చేసింది. ఇక అలాగే ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించిన శిశిర్ శర్మ తన పాత్రకు పూర్తి న్యాయం చేసారు.

అలాగే మరో సైంటిస్ట్ గా కనిపించిన మక్రాంద్ కు అంత స్పేస్ లేకపోయినా ఓకే అని చెప్పొచ్చు. అలాగే ఈ చిత్రంలో సంగీతం అలాగే పాటలు బాగున్నాయ్ అనిపిస్తుంది. అయితే ఈ చిత్రంలో మెయిన్ హైలైట్ మాత్రం సిమ్రాన్ చౌదరి రోల్ అని చెప్పాలి. ఆమెకు ఉన్న పాత్ర కానీ ఆమెపై డిజైన్ చేసిన సీన్స్ అండ్ స్టోరీ మాత్రం ఆడియెన్స్ ను మెప్పించేలా ఉంటాయి. అలాగే ఆమె కూడా తన రోల్ లో చాలా బాగా చేసింది.

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో చెప్పాలి అంటే చాలానే లోటు పాట్లు ఉన్నాయి. సినిమా చూస్తున్నంత సేపు అవి యిట్టె తెలిసిపోతాయి. ముఖ్యంగా ఈ సినిమా నరేషన్ లో ఎలాంటి సీరియస్ నెస్ ఉండదు. అలాగే కొన్ని రోల్స్ అయితే అసలు కథకు సంబంధం లేకుండా వస్తున్నట్టు అనిపిస్తాయి.

వీటి మూలాన కథ పక్కదారి పట్టినట్టు అనిపిస్తుంది. అలాగే స్క్రీన్ ప్లే కూడా ఒకానొక స్టేజ్ వచ్చేసరికి ఎక్కడికో పక్క దారి పట్టేసినట్టు అనిపిస్తుంది. ఇంకా అలాగే సైంటిఫిక్ యాంగిల్ ఖచ్చితంగా చాలా మందికి ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇది మొదట్లో ఇంట్రెస్టింగ్ గా అనిపించినా దానిని లాస్ట్ కి సిల్లీగా మారిపోయినట్టు అనిపిస్తుంది.

అలాగే కొన్ని సన్నివేశాల్లో కానీ రోల్స్ లో కానీ ఎలాంటి సంబంధం లేదు అన్నట్టు అనిపిస్తుంది. అలాగే హీరోపై డిజైన్ చేసిన స్టోరీ కూడా అంతగా ఆకట్టుకోదు. ఇక అలాగే లాస్ట్ పది నిమిషాల్లో హీరో చేసే కొన్ని సైంటిఫిక్ ఎపిసోడ్స్ కూడా ఏమంత మెప్పించవు. అలాగే చాలానే ఫ్లా లు కూడా ఉన్నాయి.

సాంకేతిక వర్గం :

ఈ సైంటిఫిక్ బ్యాక్ డ్రాప్ సినిమాలో నిర్మాణ విలువలు కోసం చెప్పుకోవాలి. మంచి కెమెరా వర్క్ అలాగే కొన్ని అవసమైన సన్నివేశాల్లో మంచి గ్రాఫికల్ వర్క్ లో మంచి నిర్మాణ విలువలు తెలుస్తాయి. అలాగే పాటల్లో లిరిక్స్ కూడా బాగున్నాయి.

ఇక దర్శకుడు రాఘవేంద్ర వర్మ విషయానికి వస్తే తాను ఎంచుకున్న కథే అసలు విచిత్రంగా అనిపిస్తుంది. పైగా దాన్ని రాసుకోడంలో కూడా చాలా లోటుపాట్లు అనిపిస్తాయి. ఓ రోబోట్ పై డిజైన్ చేసిన డ్రామా అనుకున్న స్థాయిలో ఎలివేట్ కాలేదు.

అలాగే కొన్ని సన్నివేశాల్లో ఈ దర్శకుడు ఇంకా మెరుగు కావాల్సి ఉంది. మంచి ఎమోషన్స్ ను రాబట్టుకోవడంలో కూడా విఫలం అయ్యాడు. ఇక లాజిక్స్ కానీ ట్విస్టుల విషయంలో అయితే చెప్పనవసరమే లేదు.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే “బొంబాట్” అనే సైంటిఫిక్ డ్రామా సరిగ్గా సక్సెస్ కాలేదని చెప్పాలి. ఒక్క సిమ్రాన్ చౌదరి ఎపిసోడ్ అలాగే మ్యూజిక్ చిన్నపాటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తప్ప ఇందులో అసలు పెద్దగా చెప్పుకోడానికి ఏమీ లేదు. కథ నుంచి పాత్రలు ఎమోషన్స్ వరకు చాలా వాటిలో ఉన్న లోపాలు ఏమంత ఈ చిత్రాన్నిఓ సిల్లీ ఫ్లిక్ గా మార్చేశాయి కాకపోతే ఏదో కొత్త సినిమా వచ్చింది చూసెయ్యాలి అనుకుంటే ఒక్కసారి చూడొచ్చు.

123telugu.com Rating : 2/5
Reviewed by 123telugu Team

Click Here For English Review

 

సంబంధిత సమాచారం :