జాన్వీ ని అపార్ధం చేసుకుంటున్నారు- బోనికపూర్

Published on Aug 27, 2019 1:00 am IST

దివంగత నటిశ్రీదేవి భర్త బోనీ కపూర్, జాన్వీ కపూర్ పై వస్తున్న వార్తలను ఖండించారు. జాన్వీ కపూర్ కి సౌత్ ఇండస్ట్రీ పట్ల అయిష్టత ఉన్నదని, ఆమె సౌత్ హీరోల పక్కన నటించడానికి సముఖత చూపడం లేదని వస్తున్న వార్తలలో ఎటువంటి నిజం లేదని, ఆయన పేర్కొన్నారు. నిజానికి జాన్వీ మంచి స్క్రిప్ట్ ఉంటే ఖచ్చితంగా సౌత్ చిత్రాలలో నటిస్తారంటూ తేల్చిచెప్పారు.

కాగా త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న విజయ్ దేవరకొండ, పూరిల మూవీలో హీరోయిన్ గా జాన్వీ నటించనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఐతే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ ఇండస్ట్రీలో ప్రముఖంగా వినిపిస్తున్న వార్త. ఇదే కనుక నిజం ఐతే తెలుగు చిత్రాలతో విడదీయరాని అనుభందం ఉన్న శ్రీదేవి నటవారసురాలు జాన్వీ నటించే మొదటి సౌత్ మూవీ ఇదే అవుతుంది.

సంబంధిత సమాచారం :