అందరూ బాటిల్ క్యాప్ ఛాలెంజ్, అల్లుడు శ్రీను మాత్రం…!

అందరూ బాటిల్ క్యాప్ ఛాలెంజ్, అల్లుడు శ్రీను మాత్రం…!

Published on Jul 8, 2019 8:08 PM IST

బెల్లం కొండ సాయి శ్రీనివాస్ రమేష్ వర్మ దర్శకత్వంలో సస్పెన్సు క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న “రాక్షసుడు” మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో విడుదలై విజయం సాధించిన “రాక్షసన్” మూవీకి తెలుగు రీమేక్ గా ఈ చిత్రం నిర్మితమౌతుంది. అనుపమ పరమేశ్వరన్ బెల్లంకొండ శ్రీనివాస్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 2విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఐతే తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ ఓ ఫిట్నెస్ వీడియో చేసి తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.ప్రస్తుతం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా బాటిల్ క్యాప్ ఛాలెంజ్ నడుస్తుంది. యంగ్ హీరో కార్తికేయ కూడా నేడు ఓ బాటిల్ క్యాప్ ఛాలెంజ్ చేసి చూపించాడు.అందరూ బాటిల్ క్యాప్ ఛాలెంజ్ చేస్తుంటే శ్రీనివాస్ మాత్రం ఫిట్నెస్ ఛాలెంజ్ వీడియో పెట్టాడు. జనరల్ గా ఎప్పుడూ సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేసే బెల్లంకొండ శ్రీనివాస్ యాక్షన్ హీరోగా టాలీవుడ్ లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఐతే రీసెంట్ గా విడుదలైన “సీత” మూవీలో మాత్రం కాజల్ సీతకి కి భయపడే అమాయక రాముని పాత్ర చేసి అలరించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు