అసలు పోటీ మొదలయ్యేది రేపటి నుండే !
Published on Sep 26, 2017 9:33 am IST


రేపటి నుండి టాలీవుడ్ బాక్సాఫీస్ ముందు అసలు పోటీ మొదలుకానుంది. ఎన్టీఆర్ ‘జై లవ కుశ’ గత గురువారం విడుదలై మంచి పెనింగ్స్ తో పాటు మెరుగైన కలెక్షన్లను కూడా రాబడుతున్న తరుణంలో మహేష్ ‘స్పైడర్’ రేపు విడుదలవుతూ గట్టి పోటీకి తెరలేపనుంది. ఎన్టీఆర్ చిత్రం ఇప్పటి వరకు అన్ని ఏరియాల్లోనూ డిస్ట్రిబ్యూటర్లు వెచ్చించిన మొత్తంలో దాదాపు సగం రాబట్టగా మిగిలిన సగం జమ చేయాలంటే లాంగ్ రన్ ఖచ్చితంగా అవసరం. యావరేజ్ టాక్ తో మొదలైన ఈ చిత్రం ఎలాంటి పోటీ లేకపోవడంతో మెల్లగా పుజుకుంతున్న తరుణంలో మహేష్ సినిమా దిగుతుండటం ఆ చిత్ర వసూళ్ల మీద ప్రభావం చూపనుంది.

మొదటి రెండు రోజుల్లో ఓపెనింగ్స్ తో గట్టి ఎఫెక్ట్ చూపే ‘స్పైడర్’ భారీ విజయాన్ని గనుక ఖాయం చేసుకుంటే లవ కుశ పై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక ‘స్పైడర్’ విషయంలో కూడా ఈ పోటీ ఎఫెక్ట్ చూపనుంది. లవ కుశ ఇప్పటికే మ్యాగ్జిమమ్ థియేటర్లలో ఆడుతుండంతో ‘స్పైడర్’ కు సోలో రిలీజ్ సమయంలో దొరికే థియేటర్లు ఇప్పుడు లభించే అవకాశం లేదు. కాబట్టి ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాల ఓపెనింగ్స్ మీద పడుతుంది.

ఇక చిత్ర ఫలితం గనుక సరిగా లేకపోతే ‘జై లవ కుశ’ మరింత పుంజుకుని ‘స్పైడర్’ యొక్క లాంగ్ రన్ కలెక్షన్లు టైట్ అయ్యే పరిస్థితి నెలకొనవచ్చు. ఈ పోటీకి తోడు శుక్రవారం శర్వానంద్, మారుతిల ‘మహానుభావుడు’ రిలీజ్ కానుంది. మంచి పాజిటివ్ బజ్ ఉన్న ఈ చిత్రం క్లిక్ అయితే అటు ఎన్టీఆర్, ఇటు మహేష్ ఇద్దరి సినిమాల వసూళ్ల మీద ఎంతో కొంత ప్రభావం చూపుతుంది. మరి రేపటి నుండి మొదలుకానున్న ఈ క్లిష్టమైన పోటీ నుండి ఏ చిత్రం ఎలాంటి ఫలితంతో బయటపడుతుందో నెక్స్ట్ వీక్ తేలిపోనుంది.

 
Like us on Facebook