సమీక్ష : ‘బాయ్’ – ఆకట్టుకోలేకపోయిన హై స్కూల్ లవ్ స్టోరీ

Published on Aug 24, 2019 3:02 am IST
Boy movie review

విడుదల తేదీ : ఆగస్టు 23, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : లక్ష్య, సాహితీ, మాధవి, కల్పలత, నీరజ్, వినయ్ వర్మ, నేహల్, వర్ష, త్రిశూల్ తదితరులు

దర్శకత్వం : అమర్ విశ్వరాజ్

నిర్మాత‌లు : ఆర్. రవిశంకర్ రాజు, అమర్ విశ్వరాజ్.

సంగీతం : ఎల్విన్ జేమ్స్, జయ ప్రకాష్. జె.

సినిమాటోగ్రఫర్ : అస్కర్

ఎడిటర్ : ఏకలవ్యన్

అమర్ విశ్వరాజ్ దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం ‘బాయ్’. ఆర్. రవి శంకర్ రాజు మరో నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంలో లక్ష్య, సాహితీ లీడ్ రోల్ ప్లే చేశారు. కాగా ఈ సినిమా ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

మహితేజ్ (లక్ష్య) టెన్త్ క్లాస్ చదువుతుంటాడు. అందరూ తనను చిన్నపిల్లడిలా ట్రీట్ చేయడం, తనకు ఏమాత్రం నచ్చదు. అయితే ఓ సంఘటన కారణంగా వర్ణ (సాహితీ) మహితేజ్ తో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడుతుంది. అలా మొదలైన వారి స్నేహం ఎంతవరకూ సాగింది..? ఇంతకీ మహితేజ్ కి ఉన్న పెద్ద సమస్య ఏమిటి ? ఆ సమస్యకి మాహితేజ్ స్కూల్ మ్యాథ్స్ టీచర్ (వినయ్ వర్మ) ఎలా కారణమయ్యాడు ? చివరికి ఆ టీచర్ నుండే మాహితేజ్ నేర్చుకున్నది ఏమిటి ? ఆ క్రమంలో అతని జీవితంలో జరిగిన సంఘటనలు ఏమిటి ? అదేవిధంగా మహితేజ్ – వర్ణల మధ్య స్నేహం ఆ తరువాత కూడా అలాగే కొనసాగిందా ? లేదా ? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమాను వెండి తెర పై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

మ్యాథ్స్ రాని ఓ టెన్త్ క్లాస్ కుర్రాడు.. టెన్త్ క్లాస్ లో ఎదుర్కొన్న సమస్యలు, ఆలాగే అతను ఓ అమ్మాయిని ఇష్టపడటం, పైగా ఆ అమ్మాయికి అతను మ్యాథ్స్ చెప్పాల్సి రావటం ఇలా సినిమాలో అయితే కొన్ని ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన లక్ష్య తన పాత్రకు తగ్గట్లు బాగా నటించాడు. ముఖ్యంగా డైలాగ్ డెలివరీతో అలాగే డాన్స్ తో ఆకట్టుకున్నాడు. అదే విధంగా సెసెకెండ్ హాఫ్ లో వినయ్ వర్మతో సాగే సన్నివేశాల్లో తన హావభావాలతో చక్కని పెర్ఫార్మెన్స్ కనబర్చాడు.

ఇక హీరోయిన్ గా నటించిన సాహితీ కూడా బాగా నటించడంతో పాటు అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. అలాగే సినిమాకే కీలక పాత్రలో కనిపించిన వినయ్ వర్మ అద్భుతంగా నటించారు. విషయంలేని సీన్స్ లో కూడా ఆయన తన యాక్టింగ్ తో మెప్పించారు. హీరోకి ఫ్రెండ్ గా నటించిన నటుడు కూడా కామెడీ ఎక్స్ ప్రెషన్స్ తో నవ్వించే ప్రయత్నం చేశాడు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

 

మైనస్ పాయింట్స్ :

 

దర్శకుడు అమర్ విశ్వరాజ్ కొన్ని లవ్ సీన్స్ తో మరియు కొన్ని స్కూల్ సీన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసినా.. సినిమా మాత్రం ఆసక్తికరంగా సాగదు. మెయిన్ గా సినిమాలో స్టోరీ చాలా వీక్ గా ఉంది. దీనికి తోడు స్క్రీన్ ప్లే పరంగా కూడా సినిమా ఏ మాత్రం ఆకట్టుకునే విధంగా అనిపించదు. స్క్రిప్ట్ లో బలం లేని సీన్స్ ఎక్కువైపోయాయి. పైగా విషయం లేని కామెడీ సీన్స్ కూడా నవ్వించలేక పోవడం.. అలాగే కొన్ని అనవసరమైన సీన్స్ ను ఇరికించడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి.

మొత్తానికి దర్శకుడు కంటెంట్ పరంగా మంచి ఎంటర్ టైన్మెంట్ మరియు భావోద్వేగాన్ని పండించే సన్నివేశాలు రాసుకునే అవకాశం ఉన్నా, దర్శకుడు మాత్రం సినిమాని ఆ దిశగా నడిపలేకపోయారు. అయితే వినయ్ వర్మ సన్నివేశాలు మాత్రం పర్వాలేదనిపిస్తాయి. కానీ ఓవరాల్ గా సినిమాను దర్శకుడు సినిమాని ఇంట్రస్టింగ్ ఎలెమెంట్స్ తో ఆసక్తికరంగా మలచలేకపోయాడు.

వీటికి తోడు కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో ప్లే లో సరైన ప్లో కూడా లేకుండా పోయింది. దర్శకుడు స్క్రిప్ట్ లోని లోపాలను ముందే సరిచేసుకుని ఉండి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది.

 

సాంకేతిక విభాగం :

 

సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు కొన్ని సన్నివేశాల్లో మెప్పించే ప్రయత్నం చేసినా, పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథా కథనాన్ని మాత్రం రాసుకోలేదు. ఇక అస్కర్ సినిమాటోగ్రఫీ బాగుంది. మూవీ ఓపెనింగ్ దృశ్యాలతో పాటు సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను ఆయన చాలా అందంగా చూపించారు. ఇక సంగీత విషయానికి వస్తే.. రెండు పాటలు పర్వాలేదనిపించినా.. నేపధ్య సంగీతం చికాకు పుట్టిస్తోంది. ఏకలవ్యన్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాతలు ఆర్. రవిశంకర్ రాజు, అమర్ విశ్వరాజ్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.

 

తీర్పు :

 

అమర్ విశ్వరాజ్ దర్శకత్వంలో లక్ష్య, సాహితీ లీడ్ రోల్స్ లో వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. అయితే మ్యాథ్స్ రాని ఓ టెన్త్ క్లాస్ కుర్రాడు ఎదుర్కొన్న సమస్యలు, ఆలాగే అతని ప్రేమ తాలూకు కొన్ని సన్నివేశాలు, అక్కడక్కడా రేర్ గా వచ్చే కొన్ని కామెడీ సీన్స్ పర్వాలేదనిపించినా.. కథా కథనాలు ఏ మాత్రం ఆసక్తి కరంగా సాగక పోవడం, సినిమాలో సరైన ప్లో మిస్ అవ్వడం, ఓవరాల్ గా సినిమా స్లోగా సాగుతూ బోర్ కొట్టించడం.. వంటి అంశాలు సినిమా ఫలితాన్ని బాగా దెబ్బ తీశాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నిలబడటం కష్టమే.

123telugu.com Rating :  2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :