హీరోయిన్ కోసం బోయపాటి ఆడిషన్స్ !

Published on Sep 20, 2020 7:30 pm IST

బాలయ్య బాబుకు బోయపాటి సినిమాలో ఇంకా హీరోయిన్ దొరకలేదు. అందుకే హీరోయిన్ ను ఫిక్స్ చేయకుండానే ఫస్ట్ షెడ్యూల్ షూట్ చేసి.. అలాగే ఈ సినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేసేశారు, అయితే తాజాగా బోయపాటి శ్రీను ప్రస్తుతం హీరోయిన్ కోసం ఆడిషన్స్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ముందుగా ఓ కొత్త హీరోయిన్ ను తీసుకుని ఆమెకు కొన్ని వర్క్ షాప్స్ కూడా నిర్వహించినా.. బెటర్ ఆప్షన్ కోసం మరో హీరోయిన్ కోసం ఆడిషన్స్ తీసుకుంటున్నాడు బోయపాటి. నిజానికి పెద్ద హీరోయిన్స్ చాలామందినే ఉన్నారు బాలయ్య సినిమాలో చేయడానికి.

కానీ, వాళ్ళు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ అడుగుతున్నారట. ఇక టీజ‌ర్ ను ‘బీబీ3′ పేరుతో విడుద‌ల‌ చేసి సెన్సేష‌న్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా టీజర్ లో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ అండ్ ఫుల్ యాక్షన్ తో పాటు పంచ కట్టులో వైట్ అండ్ వైట్ లో అభిమానులను అలరించారు. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన కొత్త హీరోయిన్ నటిస్తోందని బోయపాటి ఇప్పటికే చెప్పారు. ఏమైనా బాలయ్యకు ఈ సారి కూడా బోయపాటి సూపర్ హిట్ ఇచ్చేలానే ఉన్నాడు.

సంబంధిత సమాచారం :

More