బాలకృష్ణ సినిమాకు బోయపాటి భారీ రెమ్యూనరేషన్ !

Published on Dec 26, 2018 8:55 am IST

నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో తెరకెక్కిన ‘సింహ , లెజెండ్’ చిత్రాలు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో తెలిసిందే. తాజాగా వీరిద్దరు కలిసి హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ తన తదుపరి చిత్రంలో నటించనున్నాడని తెలిసిందే. ఈ చిత్రం కోసం బోయపాటి ఏకంగా 15కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని బాలకృష్ణ తన సొంత బ్యానర్ ఎన్ బి కె ఫిలిమ్స్ నిర్మించనుంది. ఫిబ్రవరి నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇక ప్రస్తుతం బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర షూటింగ్ లో బిజీగా ఉండగా బోయపాటి రామ్ చరణ్ నటిస్తున్న ‘వినయ విధేయ రామ’ షూటింగ్ లో బిజీగా వున్నాడు.

సంబంధిత సమాచారం :