వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి రెడీ అయిన “బ్రహ్మాస్త్రం”

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి రెడీ అయిన “బ్రహ్మాస్త్రం”

Published on Apr 10, 2023 8:16 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా, అలియా భట్ హీరోయిన్ గా అయాన్ ముఖర్జీ దర్శకత్వం లో తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ బ్రహ్మాస్త్రం. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను కూడా రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి రెడీ అవుతోంది.

ఈ చిత్రం తెలుగు వెర్షన్ బుల్లితెర పై అలరించడానికి సిద్దం అయ్యింది. ఏప్రిల్ 19 వ తేదీన స్టార్ మా లో ఈ చిత్రం ప్రసారం కానుంది. అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్, అక్కినేని నాగార్జున కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు