అల్లు అర్జున్- త్రివిక్రమ్ గ్రాండ్ సక్సెస్…!

Published on Oct 19, 2019 4:35 pm IST

అల వైకుంఠపురంలో అల్లు అర్జున్ దర్శకుడు త్రివిక్రమ్ గ్రాండ్ సక్సెస్ కొట్టారు. అసలు మూవీనే విడుదల కాలేదు సక్సెస్ కొట్టడమేమిటి అని ఆశ్చర్య పోకండి. అసలు విషయం ఏమిటంటే అలవైకుంఠపురంలోని సామజవరగమనా సాంగ్ ఏడు లక్షల లైక్స్ సాధించి తెలుగులోనే ఆ ఘనత సాధించిన సాంగ్ గా నిలిచింది. గత నెల 28న యూట్యూబ్ లో విడుదలైన ఈ సాంగ్ 41మిలియన్ వ్యూస్ ని సాధించడం గమనార్హం. క్లాసికల్ మ్యూజిక్ కి వెస్ట్రన్ టచ్ ఇచ్చి థమన్ స్వరపరించిన ఈ సాంగ్ ప్రేక్షకులకు అమితంగా నచ్చేసింది.

ఎప్పుడో జనవరిలో విడుదల కానున్న సినిమా పాటను మూడు నెలలకు ముందే విడుదల చేయడం ఏమిటని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఐతే అలా చేయడం వెనుక అసలు కారణం మూవీకి కావలసినంత ప్రచారం కలిగేలా చేయడమే. సామజవరగమనా సాంగ్ సూపర్ సక్సెస్ కావడంతో వీరి ప్లాన్ గ్రాండ్ సక్సెస్ ఐయ్యిందన్నమాట. 25లక్షల రూపాయలకు పైగా వెచ్చించి ఈ పాటను ప్రత్యేకమైన సెటప్ లో థమన్, సింగర్ సిద్ శ్రీరామ్ పై రూపొందించారు. వారి ప్రణాళిక ఫలించి ఈ సాంగ్ వలన మూవీ విపరీతమైన ప్రచారం దక్కించుకుంది.

సంబంధిత సమాచారం :

X
More