బన్నీ నెక్స్ట్ యాక్షన్ డైరెక్టర్ తోనే ?

Published on Apr 26, 2021 12:00 am IST

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలయ్యతో ‘అఖండ’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ఏకంగా 38 మిలియన్ల వ్యూస్ ను తెచ్చుకుని రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. దాంతో బోయపాటి టేకింగ్ పై మళ్ళీ ప్రేక్షకుల్లో ఆసక్తి బాగా పెరిగింది. అందుకే బోయపాటి తరువాత సినిమా పై అప్పుడే రూమర్స్ మొదలైపోయాయి. ఎలాగూ మరో మూడు నెలల్లో అఖండ సినిమా పూర్తి కానుంది. మరి ఆ తరువాత సినిమా ఏమిటి ? కాగా తాజాగా తన తరువాత సినిమాని బోయపాటి బన్నీతో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది.

ఈ సినిమా వచ్చే ఏడాది ఉంటుందని… పైగా ఈ చిత్రాన్ని ఓ ప్రముఖ నిర్మాత నిర్మించనున్నారని సమాచారం. అయితే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇప్పటికే బోయపాటి అల్లు అర్జున్ కోసం ఓ ఫుల్ యాక్షన్ స్క్రిప్టును సిద్ధం చేయిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పక్కా యాక్షన్ తో సాగే కామెడీ ఎంటర్‌టైనర్‌ గా ఉండనుందని.. ముఖ్యంగా బన్నీకి సరిపడే స్టోరీతో బోయపాటి ఈ సినిమాని ప్లాన్ చేశాడట. ఆల్ రెడీ సరైనోడు అనే సూపర్ హిట్ సినిమా వీరి ఖాతాలో ఉంది కాబట్టి .. వీరిద్దరి కాంబినేషన్ పెద్దగా ఆటంకం ఉండకపోవచ్చు.

సంబంధిత సమాచారం :