మిలియన్ మార్కును దాటేసిన ‘డీజే – శరణం భజే భజే’ !
Published on May 24, 2017 10:52 am IST


అల్లు అర్జున్ చేస్తున్న తాజా చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. టీజర్ తో ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచేసిన ఈ చిత్రం తాజాగా విడుదలైన ‘డీజే -శరణం భజే భజే’ పాటతో ఆ క్రేజ్ ని మరింత తారా స్థాయికి తీసుకెళ్లింది. అంతేగాక వ్యూస్ పరంగా కూడా ఈ పాట ట్రెండ్ సెట్ చేసింది. మే 22వ తేదీ సాయంత్రం 6 గంటలకు విడుదలైన ఈ పాట కేవలం ఒకటిన్నర రోజులోనే మిలియన్ మార్కును అవలీలగా అందుకుంది.

ఇప్పటి వరకు ఈ పాటకు 1,149,315 వ్యూస్ తో పాటు 37,500 లైక్స్ కూడా దక్కాయి. అంతేగాక ఈ ఒక్క పాటతో చిత్ర ఆడియోపై బ్రహ్మాండమైన పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. జొన్నవిత్తుల రాసిన అద్భుతమైన లిరిక్స్ కు విజయ్ ప్రకాష్ గాత్రం వెన్నుదన్నుగా నిలవగా దేవి శ్రీ ప్రసాద్ అందించిన భిన్నమైన సంగీతం ప్రాణం పోసింది. దీంతో మిగతా పాటలు కూడా ఇదే స్థాయిలో ఉంటాయనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది. అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 23న రిలీజ్ చేయనున్నారు.

 
Like us on Facebook