టాప్ ట్రెండింగ్ లో ‘బుట్ట బొమ్మా’ సాంగ్ టీజర్

Published on Dec 23, 2019 6:13 pm IST

థమన్ అల వైకుంఠపురంలో సాంగ్స్ ఒక రేంజ్ లో కంపోజ్ చేశారు. మొదటి సాంగ్ సామాజవరగమనా..తో సంచలనాలు మొదలుపెట్టిన ఆయన రాములో రాములా… మరియు ఓ మై గాడ్ డాడీ.. సాంగ్స్ తో కొనసాగించారు. విడుదలైన మూడు పాటలు సూపర్ సక్సెస్ సాధించిన నేపథ్యంలో రేపు రానున్న నాలుగవ సాంగ్ కొరకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలవైకుంఠపురంలో చిత్రం నుండి నాలుగవ సాంగ్ గా వస్తున్న బుట్ట బొమ్మా..టీజర్ నిన్న విడుదల చేశారు. అర్మాన్ మాలిక్ పాడిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.

కాగా ఈ సాంగ్ టీజర్ నిన్నటి నుండి యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. విశేష ఆదరణ దక్కించుకున్న ఈ సాంగ్ టీసర్ రెండు మిలియన్ వ్యూస్ కి చేరువైంది. బుట్ట బొమ్మా పూర్తి సాంగ్ రేపు విడుదల కానుంది. అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే నెల 12న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More