సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా రాబోతున్న సినిమా ‘జైలర్ 2’. ఎలాగూ రజినీకాంత్ మాస్ ఇమేజ్, నెల్సన్–అనిరుధ్ కాంబో, ‘జైలర్’ సీక్వెల్ అడ్వాంటేజ్, భారీ స్టార్ క్యాస్టింగ్ ఇవన్నీ కలుపుకుంటే.. ‘జైలర్ 2’పై తెలుగులో కూడా మంచి బజ్ ఉంది. ముఖ్యంగా రజినీకాంత్ క్రేజ్, ‘జైలర్’ సక్సెస్, దసరా రిలీజ్ కారణంగా ఓపెనింగ్స్‌పై ట్రేడ్‌లో కూడా ఆసక్తి కనిపిస్తోంది. దీనికితోడు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ కూడా భారీ స్థాయిలో అమ్ముడవడం సినిమాపై ఉన్న అంచనాలకు మరో సంకేతంగా నిలుస్తోంది.
ఇక ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటంతో ఈ చిత్ర మ్యూజిక్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎస్‌జే సూర్య, విద్యారమ్య కృష్ణన్, యోగి బాబు తదితర భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రం, దసరా కానుకగా అక్టోబర్ 15, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ట్రైలర్ బాగా పేలితే దసరా సీజన్‌లో తెలుగులో భారీ ఓపెనింగ్స్‌తో పాటు మంచి కమర్షియల్ రన్ సాధించే ఛాన్స్ ఉంది.


