సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో వస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ ‘వారణాసి’ కోసం అందరికీ తెలిసిందే. భారీ హైప్ సొంతం చేసుకున్న ఈ చిత్రం విడుదల ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం ఏ చిన్న ప్రస్తావన వచ్చినా ఇప్పుడు మంచి వైరల్ గా మారుతుంది.
నిర్మాత ఎస్ ఎస్ కార్తికేయ ఆల్రెడీ సినిమా యాక్షన్ పార్ట్ విషయంలో ఇచ్చిన స్టేట్మెంట్ ఫ్యాన్స్ లో సరికొత్త ఉత్తేజాన్ని తీసుకొస్తే రీసెంట్ గానే వీరి నుంచి వచ్చిన సినిమా ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రమోషన్స్ లో చేసిన మరో స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది. వారణాసి కోసం ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదొక అగ్ని పర్వతం అని తాను తెలిపాడు.
దీనితో సూపర్ ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు. అగ్ని పర్వతం ఒక్కసారిగా విస్ఫోటనం చెందితే దాని ప్రభావం ఎవరి ఊహకి కూడా అందదు. సో అలాంటి పొటెన్షియల్ వారణాసి కి ఉందని చెప్పడంతో ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ వెర్రెత్తిపోతున్నారు.


