సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ కలయికలో చేసిన భారీ హిస్టారికల్ డ్రామా ‘రణబాలి’ కోసం అందరికీ తెలిసిందే. మంచి బజ్ సొంతం చేసుకున్న ఈ సినిమా కోసం అంతా ఎదురు చూస్తున్న గ్యాప్ లో ఈ సినిమాలో తెలంగాణాలో సాధారణ ధరలు, కానీ ఏపీలో మాత్రం టికెట్ రేట్స్ హైక్స్ తో వస్తుంది అనే టాక్ చర్చకి దారి తీసింది. దీనితో మేకర్స్ ఈ రూమర్స్ పై ఓ క్లారిటీ ఇచ్చేసారు.
రణబాలి రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ధరల తోనే తీసుకొస్తున్నామని, తాము ఎలాంటి హైక్స్ కోసం అప్లై చేయలేదని ఖరారు చేశారు. తమ సినిమాపై నమ్మకం ఉందని ప్రజలు తమ సినిమాని ఆదరిస్తారు అని మైత్రి మూవీ మేకర్స్ ఖరారు చేశారు. దీనితో రణబాలి విషయంలో వచ్చిన ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా గ్రాండ్ గా ఈ అక్టోబర్ 16న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.
There have been reports that we have applied for ticket price hikes in Andhra Pradesh for #Ranabaali.
We would like to clarify that these reports are completely false. We have not applied for any ticket price hikes in either of the Telugu States.
#Ranabaali will release at standard ticket prices, and we are confident that audiences will have a great cinematic experience this festive season.
#RanabaaliOnOct16th
— Mythri Movie Makers (@MythriOfficial) October 4, 2026


