మన టాలీవుడ్ మోస్ట్ లవబుల్ సీనియర్ స్టార్ హీరో వెంకీ మామ అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో చేస్తున్న అవైటెడ్ సినిమా సినిమా ‘ఆదర్శ కుటుంబం’ కోసం అందరికీ తెలిసిందే.ఈ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ చేసినప్పుడే సాలిడ్ బజ్ సొంతం చేసుకున్న ఈ సినిమా నెమ్మదిగా డైల్యూట్ అవుతూ వచ్చింది. అయితే దీనికి కారణం ఏంటి అంటే అభిమానులకే అర్ధం కానీ పరిస్థితి.
బ్యాక్ టు బ్యాక్ రెండు భారీ హిట్స్ అందుకున్న హీరో ఒక పక్క ఫ్యామిలీ ఆడియెన్స్ పల్స్ బాగా తెలిసిన దర్శకుడు ఇంకోపక్క, అయినప్పటికీ విడుదల దగ్గరలోనే ఉన్నా సరే ఇంకా అనుకున్నంత బజ్ మిస్సవుతుంది. దీనితో అసలు ఆదర్శ కుటుంబానికి ఎక్కడ ఏం మిస్ అయ్యింది అనేది దగ్గుబాటి ఫ్యాన్స్ లో ఒక మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. మరి సినిమా విడుదల నాటికి మూమెంట్ ఎలా ఉంటుందో చూడాలి.


