బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కించిన భారీ చిత్రమే ‘రామాయణ’. భారతీయులు కొలిచే రామాయణం చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా గ్రాండ్ హంగులతో రాబోతుంది.
ఇక ఈ సినిమా నుంచి వచ్చిన మొదటి ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీని తర్వాత సినిమా నుంచి రెండో ట్రైలర్ కూడా రాబోతుంది అని కన్ఫర్మ్ అయ్యింది. మరి దీనిపై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ అక్టోబర్ 15నే రామాయణ రెండో ట్రైలర్ ని మేకర్స్ వదలనున్నట్టు తెలుస్తుంది. ఇక దీనిపై అధికారిక క్లారిటీ రేపు రావచ్చు.
దీనితో పాటుగా రెండో సాంగ్ ని కూడా మేకర్స్ త్వరలోనే విడుదల చేయనున్నారు. మొత్తానికి రామాయణ చిత్ర యూనిట్ మళ్ళీ పనులు వేగవంతం చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రావణ పాత్రలో యష్ నటించగా తాను నిర్మాణం కూడా వహించారు.


