‘జనం కోసం జర్నలిజం’ నినాదంతో నడుస్తున్న తెలుగుప్రభ దినపత్రిక అక్టోబర్ 15న రీలాంచ్‌కు సిద్ధమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్క్యులేషన్‌లో ఉన్న ఈ పత్రికను లాభాపేక్ష లేకుండా జర్నలిస్టులే నిర్వహిస్తున్నారు.
ఈ రీలాంచ్ కార్యక్రమానికి రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కేవలం జర్నలిస్టులనే ఆహ్వానిస్తున్నారు. సీనియర్ సంపాదకుడు రామచంద్ర మూర్తితో పాటు పలువురు పత్రికా సంపాదకులు, జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.
ప్రముఖ జర్నలిస్ట్, పర్యావరణ ఉద్యమకారుడు సమయమంత్రి చంద్రశేఖర శర్మ ఆధ్వర్యంలో తెలుగుప్రభ పత్రిక కార్యకలాపాలు సాగుతున్నాయి. ఈ రీలాంచ్ సందర్భంగా పలు ప్రకటనలు ఉండే అవకాశం ఉందని మీడియా వర్గాలు భావిస్తున్నాయి.


