పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేయాల్సి ఉన్న అవైటెడ్ సినిమాల్లో దర్శకుడు నాగ్ అశ్విన్ తో చేయాల్సి ఉన్న సీక్వెల్ సినిమా కల్కి 2 కూడా ఒకటి. పార్ట్ 1 పాన్ ఇండియా లెవెల్లో మంచి హిట్ అయ్యింది. ఇక పార్ట్ 2 కూడా చేయాల్సి ఉన్న నేపథ్యంలో ప్రభాస్ కి ఉన్న ఇతర కమిట్మెంట్స్ రీత్యా నెమ్మదిగా సాగుతుంది. అయితే ఈ సినిమాలో దీపికా పాత్రకి టాలెంటెడ్ నటి సాయి పల్లవి ఎంపిక అయ్యిన సంగతి తెలిసిందే.
ఈమె కూడా త్వరలోనే సెట్స్ లోకి జాయిన్ కానున్నట్టు ఇది వరకే తెలిపాము. ఈ అక్టోబర్ లోనే సాయి పల్లవి జాయిన్ కావాల్సి ఉండగా ఈ ప్లాన్ లో ఇపుడు ఛేంజ్ వచ్చినట్టు తెలుస్తుంది. సాయి పల్లవి ప్రస్తుతం రామాయణ రిలీజ్ పై ఫోకస్ చేయగా ఆ సినిమా విడుదల తర్వాత కల్కి 2 సెట్స్ లోకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. అంటే ఈ రానున్న నవంబర్ లో ఆమె సెట్స్ లో అడుగు పెట్టనుందట. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.


