Ranabaali Censor Update: ‘రణబాలి’ సెన్సార్ పూర్తి.. కానీ?

Ranabaali Censor Update: ‘రణబాలి’ సెన్సార్ పూర్తి.. కానీ?

Published on Oct 13, 2026 1:30 PM IST

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా, తన భార్య రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సినిమా ‘రణబాలి’ విడుదల దగ్గరకి వస్తున్న నేపథ్యంలో సినిమా సెన్సార్ ని పూర్తి చేసుకున్నట్టుగా సినీ వర్గాలు తాజాగా కన్ఫర్మ్ చేసాయి. అయితే ఈ సినిమాకి దాదాపు అంతా ఏ సర్టిఫికెట్ నే రావచ్చు అని భావించి ఉండొచ్చు కానీ మేకర్స్ మాత్రం అలాంటి అడ్డంకులు లేకుండా యూ/ఏ సర్టిఫికెట్ ని తెచ్చుకున్నారట.

ఇది ఒకింత సర్ప్రైజింగ్ కూడా కావచ్చు. కానీ ట్రైలర్ లో వైలెన్స్, కొన్ని డైలాగ్ లు ఉన్నప్పటికీ సినిమా రెస్ట్రిక్ట్ కాకుండా అన్ని వర్గాల ఆడియెన్స్ కి చేరువ అయ్యే విధంగా సెన్సార్ ముగించుకోవడం జరిగింది. సో వీటిని రా అండ్ రస్టిక్ గా ఆశించే వారికి ఒకింత థియేటర్స్ లో శాటిస్ఫై చేస్తారో చూడాలి. ఇక ఈ చిత్రానికి అజయ్, అతుల్ లు సంగీతం అందించారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించిన ఈ సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో ఈ అక్టోబర్ 16న విడుదల కాబోతుంది.

తాజా వార్తలు