లీగ్ లో చాలా వెనుకబడ్డ రామ్ చరణ్? బిగ్ కాంబినేషన్స్ సెట్ చేయాల్సిందే?

లీగ్ లో చాలా వెనుకబడ్డ రామ్ చరణ్? బిగ్ కాంబినేషన్స్ సెట్ చేయాల్సిందే?

Published on Oct 13, 2026 8:08 AM IST

టాలీవుడ్ లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ బిగ్ స్టార్స్ అంతా ఇప్పుడు భారీ లైనప్ లతో తమ కెరీర్ లని ఓ రేంజ్ లో సెటప్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ హీరోస్ లో మాత్రం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఒకింత వెనుకబడే ఉన్నాడనే కామెంట్స్ ఇపుడు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ అంతా మాసివ్ లైనప్ ని ఈజీగా ఐదేళ్ల వరకు సెట్ చేసేసుకున్నారు.

కానీ రామ్ చరణ్ చేతిలో ఇపుడు అధికారికంగా సుకుమార్ తో సినిమా తప్ప మరో సినిమా కనిపించడం లేదు. దీనితో బిగ్ కాంబినేషన్స్ ని రామ్ చరణ్ ఓకే చేయాలని అభిమానులు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. మిగతా స్టార్స్ అంతా ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్ లేకుండా సెట్ చేసుకుంటే చరణ్ వైపు నుంచి మాత్రం చాలా నిదానమైన రెస్పాన్స్ కనిపిస్తుంది.

ఇదే కొనసాగితే మాత్రం ఈ పోటీ ప్రపంచంలో చరణ్ తనని తాను లిమిట్ చేసేసుకున్నట్టే అవుతుంది. RRR తర్వాత తనకి గ్లోబల్ లెవెల్ గుర్తింపు వచ్చినప్పటికీ ఆ రేంజ్ లో అడుగులు వేయకుండా ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది ఇప్పటికీ అభిమానుల్లో కొనసాగుతున్న ప్రశ్న…

తాజా వార్తలు