నందమూరి మోక్షజ్ఞ డెబ్యూపై పెరుగుతున్న అంచనాలు.!

నందమూరి మోక్షజ్ఞ డెబ్యూపై పెరుగుతున్న అంచనాలు.!

Published on Mar 17, 2015 12:08 PM IST

mokshagna
ప్రముఖ స్టార్ హీరోల వారసులు హీరోలుగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కావడం కొత్తేమీ కాదు. గత కొన్ని సంవత్సరాలుగా నందమూరి అభిమానులు మరియు ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలు ఎంతాగో ఎదురు చూస్తున్న వారసుడు నందమూరి మోక్షజ్ఞ. స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ వారసుడైన మోక్షజ్ఞ సినిమాలలోకి వస్తాడని స్వయంగా బాలకృష్ణే ఖరారు చేసిన తర్వాత, మోక్షజ్ఞ ఎంట్రీ పై మరింత ఆసక్తి పెరిగింది.

తాజాగా ఓ ఫేమస్ ఆంగ్ల పత్రిక నందమూరి మోక్షజ్ఞ తొలి సినిమా 2016 లో ఉంటుందని తెలియజేసింది. అంతే కాకుండా బాలకృష్ణ 100వ సినిమాని కూడా అదే ఇయర్ లో రిలీజ్ చేయనున్నారని సమాచారం. ఈ రెండు వార్తలు నందమూరి అభిమానుల్లో మరింత హీట్ ని పెంచేస్తున్నాయి. అంతే కాకుండా మోక్షజ్ఞ మొదటి సినిమాకి ఎవరు దర్శకుడు అనే విషయాలు కూడా అందరిలో ఆసక్తిని పెంచేస్తున్నాయి. ప్రస్తుతం మోక్షజ్ఞ న్యూ యార్క్ లో తన చదువును కొనసాగించడమే కాకుండా, యాక్టింగ్ మరియు ఫైట్స్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. ఈ వార్తను బట్టి చూస్తుంటే నందమూరి అభిమానులకి 2016 మరచిపోలేని ఇయర్ గా అనిపిస్తోంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు