నాని ‘ప్యారడైజ్’ సెన్సేషన్.. ఈ టాక్ తో కూడా మొదటి వారం మాసివ్ వసూళ్లు!

నాని ‘ప్యారడైజ్’ సెన్సేషన్.. ఈ టాక్ తో కూడా మొదటి వారం మాసివ్ వసూళ్లు!

Published on Oct 1, 2026 10:22 AM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ హీరోయిన్ కయాదు లోహర్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన అవైటెడ్ సినిమానే ది ప్యారడైజ్. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఒకింత మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయినప్పటికీ నాని హవాని అవేవి పూర్తిగా అడ్డుకోలేకపోయాయి. ఇలానే ఎట్టకేలకు మొదటి వారం రోజుల రన్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా మాసివ్ నెంబర్స్ ప్రపంచ వ్యాప్తంగా సెట్ చేసినట్టు పి ఆర్ నంబర్స్ చెబుతున్నాయి.

గత 24 గంటల్లో ఇండియా వైడ్ 55 వేలకి పైగా టికెట్ సేల్స్ జరుగగా ఓవరాల్ ప్రపంచ వ్యాప్తంగా 5 కోట్లకి పైగా గ్రాస్ అందుకున్నట్టు తెలుస్తోంది. దీనితో మొదటి వారం పూర్తయ్యే సరికి ఈ సినిమా 170 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టు తెలుస్తోంది. సో నాని సినిమా సెన్సేషన్ సెట్ చేస్తుంది అని చెప్పొచ్చు. అలాగే సినిమా లాంగ్ రన్ లో 200 కోట్ల గ్రాస్ కొట్టే ఛాన్స్ కూడా ఉంది. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించగా ఎస్ ఎల్ వి సినిమాస్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు