‘అజ్ఞాతవాసి’ ఆడియో వేడుక ఆరోజే ?
Published on Nov 29, 2017 11:05 am IST

పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘అజ్ఞాతవాసి’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ఈ సినిమాలో మొదటిపాటకు మంచి స్పందన లభించడంతో త్వరలో రెండోపాటను కూడా విడుదల చెయ్యబోతున్నామని ప్రకటించింది చిత్ర యూనిట్. అనిరుద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా ఆడియో ను డిసెంబర్ నెల 19 న విడుదల చేసే ఆలోచనలో ఉంది చిత్ర యూనిట్.

ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు కూడా మంచి స్పందన లభించింది. ప్రస్తుతం కాశీలో షూటింగ్ చేస్తున్న ఈ చిత్ర యూనిట్ డిసెంబర్ 10 న హైదరాబాద్ రానుంది. 12 నుండి పవన్ డబ్బింగ్ మొదలుపెడతారని సమాచారం. మరోవైపు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 న విడుదలకానున్న ఈ సినిమాకి భారీ అంచనాలున్నాయి.

 
Like us on Facebook