‘అజ్ఞాతవాసి’ ఆడియో విడుదల తేదీ అదేనా ?
Published on Nov 13, 2017 8:43 am IST

పవన్, త్రివిక్రమ్ ల చిత్రం ప్రస్తుతం యూరప్ లో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ‘జల్సా, అత్తారింటికికి దారేది’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న చిత్రం కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీస్థాయి అంచనాలున్నాయి. అంతేగాక చిత్రం రెగ్యులర్ కమర్షియల్ చిత్రంలా కాకుండా సరికొత్తగా ఉంటుందని చెబుతుండటంతో క్రేజ్ తారాస్థాయికి చేరుకొని ప్రీ రిలీజ్ బిజినెస్ బ్రహ్మాండంగా జరుగుతోంది.

ఇకపోతే ఇటీవలే ఈ చిత్ర ఆడియోలో ‘బయటికొచ్చి చూస్తే’ పాత విడుదలై శ్రోతలను, అభిమానులను విశేషంగా ఆకట్టుకోగా పూర్తి ఆడియో డిసెంబర్ 14న విడుదలయ్యే అవకాశమున్నట్టు సినీ టౌన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మొత్తం ఐదు పాటలు ఉంటాయట. హారిక హాసిని క్రియేషన్స్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని జనవరి 10న సంక్రాతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.

 
Like us on Facebook