‘రంగస్థలం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ ?

చరణ్ ‘రంగస్థలం’ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకురాబోతోంది. సుకుమార్ తన స్టైల్ లో తెరకెక్కించిన సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. అనసూయ మరో ముఖ్య పాత్రలో కనిపించబోతోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.

మార్చి 18న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను వైజాగ్ లో భారీ ఎత్తున చెయ్యాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. చిరంజీవి ఈ వేడుకకు హాజరుకానున్నారని సమాచారం. అయితే ఈ వార్తలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. మొదటిసారి పల్లెటూరి మాస్ గెటప్ లో చరణ్ చేస్తోన్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి చరణ్ కి సోదరుడి పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.