“సైకో వర్మ” టైటిల్‌కు సెన్సార్ అభ్యంతరం.. ఏం చెప్పిందంటే?

Published on Jul 30, 2021 1:00 am IST

ప్రముఖ నిర్మాత, దర్శకుడు నట్టి కుమార్ తనయుడు నట్టి క్రాంతి హీరోగా నటించిన చిత్రం “సైకో వర్మ” (వీడు తేడా). క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ అండ్ నట్టీస్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై శ్రీధర్ పొత్తూరి సమర్పణలో అనురాగ్ కంచర్ల నిర్మాణంలో నిర్మాత నట్టి కరుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ షాక్ ఇచ్చింది.

అయితే “సైకో వర్మ” టైటిల్‌లో సైకో అన్న పదాన్ని తొలగించమని సెన్సార్ వారు చెప్పినట్టు తెలుస్తుంది. దీనిపై నట్టికుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ గతంలో సైకో పేరుతో కొన్ని చిత్రాల టైటిల్స్ వచ్చాయని అప్పుడు అభ్యంతరం చెప్పని సెన్సార్ తమ చిత్రం టైటిల్‌కు అభ్యంతరం చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. సెన్సార్ ద్వంద విధానాలకు పాల్పడుతుందని దీనిపై అవసరమైతే హైకోర్టుకు వెళతామని నట్టికుమార్ అన్నారు.

సంబంధిత సమాచారం :