మంచి ధర పలికిన ‘ఛల్ మోహన్ రంగ’ ఓవర్సీస్ హక్కులు !
Published on Mar 14, 2018 4:21 pm IST


యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం ‘ఛల్ మోహన్ రంగ’ ముగింపు పనుల్లో బిజీగా ఉన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం యొక్క డబ్బింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. పవన్, త్రివిక్రమ్, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.

దీంతో చిత్ర ఓవర్సీస్ హక్కులు మంచి ధర పలికాయట. డిస్ట్రిబ్యూషన్ సంస్థ తెలుగు ఫిల్మ్ నగర్ ఈ హక్కుల్ని సొంతం చేసుకుంది. నితిన్ గత చిత్రం ‘అ..ఆ’ యూఎస్లో భారీ విజయాన్ని అందుకోవడంతో నితిన్ మార్కెట్ స్థాయి కూడ పెరిగింది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మేఘా ఆకాష్ కథానాయకిగా నటించగా థమన్ సంగీతాన్ని అందించారు.

 
Like us on Facebook