సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న ‘ఛల్ మోహన్ రంగ’ ట్రైలర్ !

నితిన్, మేఘా ఆకాష్ లు జంటగా నటించిన చిత్రం ‘ఛల్ మోహన్ రంగ’. ఈ చిత్రం యొక్క ట్రైలర్ నిన్న జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా విడుదలై మంచి స్పందన తెచ్చుకుంటోంది. రొమాంటిక్ కంటెంట్ తో పాటు కామెడీ పాళ్ళు కూడ ఎక్కువగానే ఉన్న టీజర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.

అలాగే థమన్ సంగీతం, నట్టి సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచేలా కనిపిస్తున్నాయి. కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, సుధాకర్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మించారు. అన్ని పనుల్ని పూర్తిచేసుకున్న ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదలకానుంది.

ట్రైలర్ కొరకు క్లిక్ చేయండి