వరుణ్ తేజ్ తో ‘ఛలో’ బ్యూటీ !

Published on Dec 3, 2018 12:03 am IST

వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఫుల్ బిజీ లో వున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్. ఆయన తాజాగా హరిశ్ శంకర్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. తమిళ సూపర్ హిట్ మూవీ ‘జిగర్ దందా’ ను తెలుగులో వరుణ్ తో రీమేక్ చేస్తున్నాడు హరీష్ . ఈచిత్రంలో వరుణ్ కు జోడిగా ఛలో బ్యూటీ రష్మిక మండన్న నటించనున్నారని సమాచారం. ఒరిజినల్ వెర్షన్ లో లక్ష్మి మీనన్ పోషించిన పాత్రను తెలుగులో రష్మిక చేయనుందట. 14 రీల్స్ బ్యానేర్ నిర్మించనున్న ఈ చిత్రం జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఇక వరుణ్ ప్రస్తుతం అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీ స్టారర్ ‘ఎఫ్ 2’లో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇక రష్మిక తెలుగులో విజయ్ దేవరకొండ తో ‘డియర్ కామ్రేడ్’ తో పాటు కన్నడలో ఒక చిత్రంలో నటిస్తూ బిజీ గా వుంది.

సంబంధిత సమాచారం :