చలో సెన్సార్ వివరాలు !

చలో సెన్సార్ వివరాలు !

Published on Jan 25, 2018 6:00 PM IST

జ్యోఅచ్యుతానంద, కళ్యాణ వైభోగమే’ సినిమాలతో మంచి విజయాలను అందుకున్న యువ హీరో నాగ శౌర్య వరుస సినిమాలతో బిజీ గా ఉన్నాడు. మొన్నా మధ్య నారా రోహిత్ హీరోగా చేసిన “కథలో రాజకుమారి” సినిమాలో గెస్ట్ రోల్ చేసిన నాగ శౌర్య ప్రస్తుతం వెంకీ కుడికుల దర్శకుడిగా పరిచయమవుతున్న చలో సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

వెంకి కుడుముల గతంలో తేజ దగ్గర దర్శకత్వ శాకలో పనిచెయ్యడం జరిగింది. తాజాగా చలో సినిమా సెన్సార్ కార్యాక్రమాలు పూర్తి అయ్యాయి. యు/ఏ సట్టిఫికేట్ పొందిన ఈ సినిమా ఫిబ్రవరి 2న విడుదల కానుంది. రాస్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈరోజు గ్రాండ్ గా జరగబోతోంది. చిరంజీవి ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రాబోతున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు