‘ఛలో ‘ శాటిలైట్ హక్కుల్ని సొంతం చేసుకున్న జెమినీ !
Published on Dec 5, 2017 1:39 pm IST

కొద్దిగా లాంగ్ గ్యాప్ తర్వాత యంగ్ హీరో నాగ శౌర్య నుండి వస్తున్నా చిత్రం ‘ఛలో’. ఆంధ్ర, తమిళనాడు సరిహద్దులో జరిగే ప్రేమ కథగా ఉండనున్న ఈ సినిమాను నూతన దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 29న రిలీజ్ చేయనున్నారు.

ఇటీవలే విడుదలైన చిత్ర టీజర్ కు మంచి స్పందన దక్కింది. దీంతో క్రేజ్ పెరగడం వలన ప్రముఖ టీవీ ఛానెల్ జెమినీ ఈ చిత్ర శాటిలైట్ హక్కుల్ని రూ.2.20 కోట్లకు కొనుగోలు చేసింది. కన్నడ ‘కిరిక్ పార్టీ’ సినిమా హీరోయిన్ రష్మిక మందన్న ఈ చిత్రంలో నాగ శౌర్య కు జంటగా నటిస్తోంది. మణిశర్మ తనయుడు సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పై ఉషా ముల్పూరి, శంకర ప్రసాద్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

 
Like us on Facebook