త్వరలో బోయపాటితో చేతులు కలపనున్న రామ్ చరణ్ !

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తున్న చిత్రాల్లో బోయపాటి శ్రీను సినిమా కూడా ఒకటి. కొద్దిరోజుల క్రితమే పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా జనవరి 28 తో మొదటి షెడ్యూల్ ను ముగించుకుంది. ఆ రోజులపాటు జరిగింది ఈ షెడ్యూల్లో నటి స్నేహ, ఇతర ముఖ్య తారాగణంపై ఈ సన్నివేశాల చిత్రీకరణ జరిగింది.

ఇక రెండవ షెడ్యూల్ ను ఫిబ్రవరి 13 నుండి మొదలుకానుంది. రామ్ చరణ్ మాత్రం ఫిబ్రవరి 25 నుండి షూటింగ్లో పాల్గొననున్నారు. ఇక ప్రతినాయకుడిగా నటిస్తున్న బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ 13వ తేదీ నుండే షూట్లో పాల్గొంటారు. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.