ఖైధీ నెం 150 లో రామ్ చరణ్ ?
Published on Dec 1, 2016 5:00 pm IST

ram-charan
మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న 150వ చిత్రం ‘ఖైధీ నెం 150’ పై అభిమానులకు బోలెడన్ని ఆశలు, అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి తన నుండి అభిమానులు ప్రధానంగా కోరుకునే డ్యాన్సులకు ఎటువంటి లోటు లేకుండా చేస్తాడని తెలియగానే అభిమానాలు పొంగిపోయారు. దానితో పాటే వారికి మరొక సప్రైజ్ ఇస్తూ ఈ ఇందులో మెగా తనయుడు రామ్ చరణ్ తేజ్ కూడా కనిపించనున్నాడని, చిరంజీవితో కలిసి ఒక పాటలో స్టెప్ వేస్తాడని వార్తలు వస్తున్నాయి.

గతంలో చిరంజీవి రామ్ చరణ్ చేసిన ‘మగధీర’లో కనిపించాడు ఆ తరువాత ‘బ్రూస్లీ’ చిత్రాల్లో సైతం కనిపించాడు. అందుకు బదులుగా, ఈ సినిమా చిరంజీవికి, అభిమానులకు ప్రత్యేకమైనది కనుక అందులో కనిపించాలని చరణ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో చరణ్ ఛాన్స్ ఇస్తే తన 15తండ్రి 0వ సినిమాలో ఒక రోల్ చేయాలనుంది అన్నాడు. ఆ మాటల ప్రకారం ఈ వార్త చాలా వరకూ నిజమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. మరి చరణ్ ఖైధీ చిత్రంలో ఎక్కడ ఎలా కనిపిస్తాడా విడుదలైతే గానీ చెప్పలేం.

 
Like us on Facebook