కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న చైతు !

27th, May 2017 - 02:18:57 PM


అక్కినేని హీరో నాగచైతన్య నటించిన రారండోయ్ వేడుక చూద్దాం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి మంచి స్పందనే వస్తోంది. ఈ చిత్రానికి తొలిరోజు నాగచైతన్య కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ లభించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం తొలిరోజు రూ 3.40 కోట్ల షేర్ ని సాధించింది.

ప్రేమమ్ చిత్రం కన్నా ఈ చిత్రం తొలిరోజు అధిక వసూళ్లని సాధించడం విశేషం. ప్రస్తుతం వేసవి సెలవులు కావడం, కుటుంబ కథతో ఈ చిత్రం రావడంతో కలసి వచ్చిందని చెప్పొచ్చు. రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ. ఈ వీకెండ్ లో రారండోయ్ వేడుక చూద్దాం చిత్రం మంచి వసూళ్లు సాధింస్తుందని అంచనా వేస్తున్నారు.