ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లిన చిరు

ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లిన చిరు

Published on Oct 14, 2019 11:47 AM IST

Chiranjeevi

‘సైరా’ చిత్రంతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవిపై ప్రముఖులంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సుబ్బిరామిరెడ్డి లాంటివారు ప్రత్యేకంగా ఆయన్ను సన్మానించారు కూడా. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నుండి కూడా చిరుకు ఆహ్వానం అందింది.

ఇది వరకే వీరి సమావేశం జరగాల్సి ఉండగా సీఎం బీజీ షెడ్యూల్ కారణంగా వాయిదాపడుతూ వచ్చి ఈరోజు కుదిరింది. మధ్యాహ్నం ఇద్దరూ కలవనున్నారు. అందుకోసం చిరు తన సతీమణితో కలిసి ప్రత్యేక విమానంలో అమరావతి బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం వీరు ముఖ్యమంత్రితో కలిసి భోజనం చేయనున్నారు.

వైఎస్ జగన్ సిఎం అయ్యాక ఆయన్ను చిరు కలవడం ఇదే తొలిసారి. దీంతో ఈ సమావేశం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ కాగా వీరి మీటింగ్ వెనుక ఎలాంటి రహస్య కారణాలు లేవని, ఇదొక సాధారణ మీటింగ్ మాత్రమేనని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు