‘నారప్ప’కు మెగాస్టార్ నుండి ప్రత్యేక అభినందన !

Published on Jul 24, 2021 1:11 pm IST

వెంకటేష్‌ ‘నారప్ప’ సినిమా జూలై 20న అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదలై మంచి హిట్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. సినీ ప్రముఖులు కూడా ఈ సినిమా పై అలాగే ఈ సినిమాలో వెంకటేష్ నటన పై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి కూడా వెంకీ నటనను మెచ్చుకుంటూ ఓ ఆడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం విశేషం.

మెగాస్టార్ రిలీజ్ చేసిన ఆడియోలో మ్యాటర్ విషయానికి వస్తే.. ‘కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశాను. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయంతో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ’ అంటూ మెగాస్టార్‌ చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :