మెగాస్టార్ చేత వినూత్న ప్రమోషన్ చేయించనున్న సుకుమార్ !
Published on Aug 2, 2017 9:14 am IST


దర్శకుడు సుకుమార్ నిర్మాణంలో రూపొందిన ‘దర్శకుడు’ చిత్రం ప్రమోషన్ల పరంగా దూసుకుపోతోంది. ఇప్పటికే టీజర్ రిలీజ్, ఆడియో వేడుక, ప్రీ రిలీజ్ ఫంక్షన్లకు ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలను పిలిచి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న ఈ సినిమా మరో వినూత్న ప్రమోషన్ కు సిద్దమైంది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి చేత చేయించడం విశేషం.

ఇంతకీ ప్రమోషన్ ఏమిటంటే ఈ సినిమా యొక్క మొదటి టికెట్ ను ఈరాజు ఉదయం 10 : 30 లకు మెగాస్టార్ కొనుగోలుచేయనున్నారు. సుకుమార్ నిర్వహిస్తున్న ఈ వినూత్న కార్యక్రమం వలన సినిమాకు మరింత ప్రచారం కలుగుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఆగష్టు 4న రిలీజ్ చేయనున్నారు.

 
Like us on Facebook