చిరంజీవి ఆగేలా లేరు.. ఇంకొకటి కూడ

Published on Mar 16, 2021 2:00 am IST

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలను ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ చేస్తున్న ఆయన తర్వాత ‘లూసిఫెర్, వేదాళం’ చిత్రాలను రీమేక్ చేయాలని అనుకున్నారు. వీటిలో ముందుగా ‘లూసిఫర్’ రీమేక్ మొదలుకానుంది. ఇప్పటికే ‘ఆచార్య’ షూటింగ్ ముగియడంతో ‘లూసిఫర్’ రీమేక్ ప్రీప్రొడక్షన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. ఈ మేరకు నిర్మాణ సంస్థ మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధికారిక ప్రకటన చేసింది.

ఈ చిత్రాన్ని మోహన్ రాజా డైరెక్ట్ చేయనున్నారు. మొదట వినాయక్ దర్శకత్వం వహిస్తారని ప్రకటించినా తర్వాత కొన్ని కారణాల వలన మోహన్ రాజా తెరపైకి రావడం జరిగింది. ఈ సినిమాపై అభిమానుల్లో తారాస్థాయి అంచనాలున్నాయి. ‘సైరా’ తర్వాత కొన్నాళ్ళు కమర్షియల్ సినిమాలు మాత్రమే చేయాలని నిర్ణయించుకున్న చిరు ఏరి కోరి ‘లూసిఫర్’ చిత్రాన్ని ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమా తరవాత మెహర్ రమేష్, బాబీలతో చిరు సినిమాలు చేయనున్నారు. ఇవి కూడ కమర్షియల్ సినిమాలే.

సంబంధిత సమాచారం :