చిరు 151వ సినిమాకు కొత్త టైటిల్
Published on Aug 21, 2017 7:32 pm IST

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం తొలి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతుండటం వలన ఆ చిత్రానికి ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’అనే పేరును ఖరారు చేసినట్టు ప్రాజెక్ట్ ఆరంభం నుండి వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. మెగా కాంపౌండ్ కూడా ఈ టైటిల్ వార్తలను ఖండించకపోవడంతో అభిమానులు, ప్రేక్షకులంతా టైటిల్ అదే అని పూర్తిగా డిసైడైపోయారు.

కానీ తాజా సమాచారం ప్రకారం టైటిల్ అది కాదని, కొత్తది నిర్ణయించారని తెలుస్తోంది. అంతేగాక టైటిల్ కూడా ‘సై రా’ అని ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఈ వార్తపై కొణిదల ప్రొడక్షన్స్ నుండి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. కాబట్టి టైటిల్ మారిందా, మారితే ఇదేనా కాదా అనే విషయాలు రేపు 9 :30 తర్వాత తెలియనున్నాయి. రామ్ చరణ్ స్వయంగా భారీ బడ్జెట్ ను వెచ్చించి నిర్మిస్తున్న ఈ సినిమాను పలు పరిశ్రమల నుండి భారీ తారాగణంతో రూపొందిస్తున్నారు.

 
Like us on Facebook