ఆగస్ట్ 21 న సాయంత్రం చిరు 153 టైటిల్ రివీల్!

Published on Aug 20, 2021 7:34 pm IST

మెగాస్టార్ చిరంజీవి సై రా నరసింహ రెడ్డి చిత్రం తర్వాత స్పీడ్ పెంచారు. కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతేకాక ఈ చిత్రం లో రామ్ చరణ్ సైతం ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. అయితే తాజాగా కొణిదెల ప్రొడక్షన్ కంపనీ మెగాస్టార్ చిరంజీవి 153 వ చిత్రానికి సంబంధించిన ఒక అప్డేట్ ను ప్రకటించడం జరిగింది.

ఆగస్ట్ 21 వ తేదీన సాయంత్రం 5:04 గంటలకు సుప్రీమ్ రివీల్ అంటూ ప్రకటించడం జరిగింది. లూసిఫర్ రీమేక్ గా 153 వ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జయం మోహన్ రాజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ మరియు ఫస్ట్ లుక్ విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్ట్ 22 వ తేదీన మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు కావడం తో మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :