దసరా పోరులో చిరు బాలయ్య..?

Published on Jan 29, 2020 8:03 am IST

ఈ ఏడాది దసరా పోరు రసవత్తరంగా ఉండనుంది. చిరు, బాలయ్య ఈ సీజన్ కి పోటీపడే అవకాశం కలదని తెలుస్తుంది. బాలయ్య-బోయపాటి మూవీ వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. నిరవధికంగా ఈ మూవీ షూటింగ్ నిర్వహించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. దీనితోఈ మూవీ షూటింగ్ త్వరిత గతిన పూర్తి చేసి దసరాకి మూవీ విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట.

ఇక కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి 152వ చిత్రం ఇటీవలే మొదలైంది. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ వేదికగా మొదలుకాగా ఈ చిత్రాన్ని కూడా దసరా బరిలో దించాలని చూస్తున్నారట. ఇదే కనుక జరిగితే బాలయ్య, చిరు ల మధ్య ఆసక్తికర బాక్సాఫీస్ వార్ జరుగనుంది. 2017లో సంక్రాంతి కి వీళ్ళిద్దరూ పోటీపడ్డారు. చిరు కమ్ బ్యాక్ మూవీ ఖైదీ 150 జనవరి 11న విడుదల కాగా బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి ఒక రోజు వ్యవధిలో 12న విడుదలైంది. హిట్ టాక్ తెచ్చుకున్న ఈ రెండు చిత్రాలు మంచి వసూళ్లను సాధించాయి.

సంబంధిత సమాచారం :

X
More