కైకాల సత్యనారాయణ గారికి చిరు పుట్టిన రోజు శుభాకాంక్షలు!

Published on Jul 25, 2021 3:49 pm IST


నేడు కైకాల సత్యనారాయణ గారి పుట్టిన రోజు సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ కి చెందిన నటీనటులు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ మేరకు కైకాల సత్యనారాయణ గారి కి మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సినిమా ఆణిముత్యం, నవరస నటనా సార్వభౌముడు, తనకు అత్యంత ఆప్తులు కైకాల సత్యనారాయణ గారి జన్మ దినాన్ని పురస్కరించుకుని, ఈరోజు తన సతీమణి తో కలిసి ఆయన ఇంటికి వెళ్ళి శుభాకాంక్షలు తెలియజేసి కాసేపు ఆయన తో ముచ్చటించినట్లు తెలిపారు. అదొక మధురమైన అనుభూతి అంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. హ్యాపీ బర్త్ డే కైకాల సత్యనారాయణ గారు అంటూ మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు. అయితే అందుకు సంబంధించిన ఒక ఫోటోను సోషల్ మీడియా లో షేర్ చేశారు చిరు.

అయితే చిరంజీవి, కైకాల సత్యనారాయణ గారి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం తో అభిమానులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ను వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :