మెగాస్టార్ చిరంజీవి గారిని కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు తో సత్కరించింది. మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులతో పాటుగా తన నివాసం కి చేరారు. ఈ మేరకు ఇంటి సభ్యుల నుండి గ్రాండ్ వెల్కమ్ లభించింది. పూలు వెదజల్లుతూ, బెలూన్ లతో చిరు కు వెల్కమ్ తెలిపారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. చిరు మనుమరాలు అయిన నివృతి ఈ వీడియో ను ఇన్ స్టాగ్రాం ద్వారా షేర్ చేయడం జరిగింది.
చిరు కు మనుమరాలు గా ఉండటం తను ఎంతో లక్కీ గా ఫీల్ అవుతున్న విషయం ను తెలుపుతూ, కంగ్రాట్స్ తెలిపింది. మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు రావడం పట్ల తెలుగు ప్రజలు, ఫ్యాన్స్, సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తదుపరి విశ్వంభర చిత్రం లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది జనవరి నెలలో ఈ చిత్రం థియేటర్ల లోకి రానుంది.