తెలంగాణా గవర్నర్ ని కలిసిన మెగాస్టార్

తెలంగాణా గవర్నర్ ని కలిసిన మెగాస్టార్

Published on Oct 5, 2019 10:00 PM IST

మెగాస్టార్ చిరజీవి నేడు మర్యాదపూర్వకంగా తెలంగాణా నూతన గవర్నర్ తమిళి సాయి సుందరరాజన్ ని కలిశారు. ఆమెను కలిసి దసరా శుభాకాంక్షలు చెప్పారు. అలాగే తాజాగా ఆయన నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని చూడవలసిందిగా ఆమెను కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన మహిళా గవర్నర్ తమిళి సాయి గారు, త్వరలోనే చూస్తానని చిరుకి మాటిచ్చారట. గవర్నర్ నరసింహన్ విరమణ అనంతరం ఇటీవలే ఈమె తెలంగాణా గవర్నర్ గా భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

ఇక సైరా తెలుగు రాష్ట్రాలలో విశేష ఆదరణ దక్కించుకుంటూ రికార్డ్ కలెక్షన్స్ సాధిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా నటించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మించగా, నయన తార, తమన్నా,అమితాబ్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి కీలకపాత్రలు చేయడం జరిగింది. ఇక ఈ చిత్రానికి సంగీతం అమిత్ త్రివేది అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు