సైరా చేసే ధైర్యం చిరుకి ఇచ్చింది ఎవరంటే…!

Published on Aug 24, 2019 8:35 pm IST

చరిత్ర మరుగున పడిన మొదటితరం స్వాతంత్ర్య యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం సైరా నరసింహారెడ్డి. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మాతగా, మెగాస్టార్ చిరంజీవి నరసింహారెడ్డి పాత్రలో చేస్తున్నారు. ఇటీవల విదులైన ఈ చిత్ర టీజర్ విశేష ఆదరణ దక్కించుకుంది. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ మూవీని విజువల్ వండర్ గా తీర్చిదిద్దాడని టీజర్ చూస్తే అర్థం అవుతుంది.

ఐతే అసలు చిరంజీవి ఈ మూవీ తీయడానికి గల కారణాన్ని ఓ జాతీయ మీడియా ప్రతినిధితో పంచుకున్నారు. నిజానికి సైరా నరసింహారెడ్డి కథను తెరకెక్కించాలనే ఆలోచన పదేళ్ల క్రితమే వచ్చినప్పటికీ బడ్జెట్ పరిమితుల దృష్ట్యా ఆ సాహసం చేయలేకపోయాము అన్నారు. కానీ బాహుబలి సాధించిన విజయం,కొల్లగొట్టిన వసూళ్లు చూసిన తరువాత మంచి సినిమా చేస్తే ప్రాంతాలకు అతీతంగా విజయం సాధించవచ్చని నమ్మకం కుదిరింది. అందుకే ఇంత భారీ బడ్జెట్ తో సైరా చిత్రాన్ని నిర్మించడానికి పూనుకున్నామని చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :