చిట్ చాట్ : సౌమ్య సుకుమార్ – మహేష్ బాబు అంటే చాలా ఇష్టం.

Published on Jul 5, 2014 8:03 pm IST

swmya-sukumar
‘వేదం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హైదరాబాది అమ్మాయి సౌమ్య సుకుమార్. ఆ సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన సౌమ్య ‘పోరా పోవే’ సినిమాతో పూర్తి స్థాయి హీరోయిన్’గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. త్వరలో ఈ సినిమా విడుదలకు సిద్దమవుతుంది. ఈ సందర్భంగా సౌమ్యతో జరిపిన చిట్ చాట్ విశేషాలు ప్రేక్షకుల కోసం..

ప్రశ్న) మీ కుటుంబ నేపధ్యం గురించి చెప్పండి..?

స) బేసిక్ గా మాది నాది తమిళనాడు. నాన్న సేల్స్ టాక్స్ డిపార్టుమెంట్ ఉద్యోగి. అమ్మ హౌస్ వైఫ్. నాకో చెల్లెలు ఉంది. నాన్న ఉద్యోగరీత్యా నా చిన్నతనంలో హైదరాబాద్ వచ్చేశారు. చిన్నప్పటి నుండి ఇక్కడే పెరిగాను. నేను తెలుగు, తమిళం, కన్నడతో పాటు కొంచం ఫ్రెంచ్ కూడా బాగా మాట్లాడగలను.

ప్రశ్న) సినిమాలలోకి ఎలా వచ్చారు..?

స) చిన్నపాటి నుండి సినిమాలపై ఆసక్తి ఉంది. జేసి బ్రదర్స్ , స్వస్తిక్ యాడ్ లలో నటించాను. వేదం సినిమా కోసం క్రిష్ ఆడిషన్స్ చేస్తున్నారని వెళ్ళాను. దర్శకుడు క్రిష్ నన్ను సెలెక్ట్ చేయడంతో ‘వేదం’లో మనోజ్ ఫ్రెండ్ పాత్రలో తొలిసారిగా తెరపై కనిపించాను. మంచు మనోజ్ రాక్ బ్యాండ్ టీంలో నేనొక చిన్న రోల్ చేశాను. వేదం తమిళ రీమేక్లో కూడా నేనే నటించాను.

ప్రశ్న) హీరో ఫ్రెండ్ నుండి హీరోయిన్ ఎలా అయ్యారు..?

స) వేదం సినిమా అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ జయపాల్ రెడ్డిగారు నన్ను ‘పోరా పోవే’ సినిమా దర్శకుడు లంకపల్లి శ్రీనివాస్ కు పరిచయం చేశారు. ఆ తర్వాత జరిగిన ఆడిషన్స్ లో నన్ను సెలెక్ట్ చేశారు.

ప్రశ్న) సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది..?

స) సినిమాలో నేను చాలా బబ్లీ క్యారెక్టర్’లో నటించాను, చాలా సరదాగా ఉంటుంది. తనొక అందమైన అమ్మాయి అనే ఫీలింగ్ ఉంటుంది. హీరోతో ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. టామ్ & జెర్రీ తరహా టైప్ అనమాట. ‘పోరా పోవే’ టైటిల్’కి తగ్గటు చాలా పోటి పడి నటించాం. సినిమాకి పర్ఫెక్ట్ టైటిల్ కుదిరింది.

ప్రశ్న) ‘పోరా పోవే’ సినిమా ఎలా ఉంటుంది..?

స) కామెడీ, ఎమోషన్స్, సెంటిమెంట్ సినిమాలో అన్ని ఉన్నాయి, దర్శకుడు లంకపల్లి శ్రీనివాస్ మంచి కథ, ఆసక్తికరమైన కధనంతో సినిమాను అద్బుతంగా తెరకెక్కించారు. ఫ్యామిలీ అందరూ కలసి చూడదగ్గ చక్కని సినిమా. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కించారు. చాలా స్టైలిష్’గా ఉంటుంది. ఇటివలే ఫస్ట్ కాపీ చూశాను. సంతోషంగా ఉంది. ప్రేక్షకుల రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నాను.

ప్రశ్న) మీకు డ్రీం రోల్స్ ఏమైనా ఉన్నాయా? మీ ఫేవరెట్ హీరో హీరోయిన్ ?

స) హీరోలలో అల్లు అర్జున్, మహేష్ బాబు అంటే చాలా ఇష్టం, హీరోయిన్లలో ఐశ్వర్యా రాయి, సమంత, జెనిలియాలు అంటే ఇష్టం. బొమ్మరిల్లులో హాసిని, క్షణక్షణంలో శ్రీదేవి గారు నటించిన పాత్రలలో నటించాలని నా డ్రీం.

ప్రశ్న) మీకు ఇష్టమైన సినిమా..?

స) గీతాంజలి సినిమా అంటే ఇష్టం. ఎప్పటికైనా

ప్రశ్న) ఫ్యూచర్ ప్రాజెక్ట్స్..?

స) ప్రస్తుతం ‘పోరా పోవే’ సినిమా విడుదల కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. కొన్ని సినిమాలకు సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. త్వరలో వెల్లడిస్తాను అని చెప్పారు.

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం :